నా జోలికొస్తే ఎముకలు విరగ్గొడతా – కంగనా రనౌత్

Sunday, February 21st, 2021, 03:33:49 PM IST

బాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ నటి ఎవరైనా ఉన్నారు అంటే మొదటగా అందరికీ గుర్తుకు వచ్చేది కంగనా రనౌత్ అని చెప్పాలి. చిత్ర పరిశ్రమ లో జరిగే పలు అంశాల పైన, సామాజిక అంశాల పైన కంగనా చేసే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా ఉంటాయి. అయితే తాజాగా మరొకసారి మాజీ మంత్రి పై ఈ భామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అందరి లాంటి దాన్ని కాదు అని, తన జోలికి ఎవరైనా వస్తే ఎముకలు విరగ్గొడతా అంటూ ఫైర్ అయ్యారు. మధ్య ప్రదేశ్ కి చెందిన మాజీ మంత్రి సుఖ్ దేవ్ పన్నే ఇటీవల కంగనా ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. కంగనా రికార్డింగ్ డ్యాన్సర్ అనే విధంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారడం తో ఘాటు జవాబిచ్చారు కంగనా.

అయితే తానేమీ వయ్యారాలు వలికించి, వ్యవహారాలు నడిపించే రకం వ్యక్తిని కాదు అని కంగనా రనౌత్ అన్నారు. తాను రాజ్ పుత్ వంశానికి చెందిన దాన్ని అని, తన జోలికి వచ్చి అవాకులు, చెవాకులు పేలోద్దు అంటూ చురకలు అంటించారు.అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇప్పటి వరకూ ఐటెం సాంగ్స్ చేయని హీరోయిన్ తానే అని చెప్పుకొచ్చారు. అలియా భట్, దీపికా పదుకునే లాంటి హీరోయిన్ కాదు అని మాజీ మంత్రి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన జోలికి వస్తే ఎముకలు విరగ్గొడతా అంటూ హెచ్చరించారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది.