నేడు కనకదుర్గ ప్లై ఓవర్ ప్రారంభం.. నెరవేరబోతున్న చిరకాల కళ..!

Friday, October 16th, 2020, 02:03:23 AM IST


విజయవాడలోని దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి రెడీ అయ్యింది. అయితే పలు కారణాలతో ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం ఎట్టకేలకు రేపు జరగబోతుంది. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు వర్చువల్ ద్వారా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి సీఎం జగన్ దీనిని ప్రారంభించబోతున్నారు.

అయితే విజయవాడ తలమానీకంగా నిర్మించిన ఈ ప్లై ఓవర్ కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు కూడా తీరనున్నాయి. ఇది ప్రారంభం అయిన తర్వాత ముందుగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దీనిపై ప్రయాణం చేస్తారు. అయితే ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం జరిగాక అధికారికంగా దీనిపైకి వాహనాలను అనుమతించబోతున్నట్టు సమాచారం.