తన సినిమాని డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్న కమల్!

Saturday, July 14th, 2018, 12:45:04 AM IST


లోకనాయకుడు కమల్ హాసన్ తన చిత్రాలకు సంబంధించి అవకాశం వున్నంతవరకు ఏదో ఒకటి వినూత్నంగా ప్లాన్ చేస్తూ వుంటారు. ఇదివరకు అయన నటించి దర్శకత్వం వహించిన విశ్వరూపం చిత్రాన్ని అయన డిటిహెచ్ లలో ప్రదర్శించి, సినిమాలకు వున్న కొన్ని పరిధులను అధిగమించారు. అయితే దానిపై కొన్నాళ్ల పాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల నుండి వ్యతిరేకత వచ్చినప్పటికి అయన ఆ తరహా వినూత్న పంథాని మాత్రం వదల్లేదు. కాగా ప్రస్తుతం అయన నటిస్తున్న విశ్వరూపం-2 చిత్రం వచ్చే నెల 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలయి వీక్షకులనుండి మంచి పేరు సంపాదించింది.

అయితే కమల్ హాసన్ ఈ చిత్ర ప్రమోషన్ ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ హోస్ట్ చేస్తున్న దస్ కా దమ్ రియాలిటీ ప్రోగ్రామును తన చిత్రానికి ప్రమోషన్ కు వేదికగా వాడుకోనున్నారట. కొద్దిరోజుల్లో ఈ షోకి కమల్ రానున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఆయన మరియు, చంద్రహాసన్, వి రవిచంద్రన్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడే ఇంత క్రేజ్ సంపాదించిన ఈ చిత్రం, రేపు విడుదల తరత ఇంకెంత దూసుకుపోతుందో తెలియాలంటే విడుదల వరకు వేచిచూడవలసిందే మరి…..