ఎవరిని రక్షించేందుకు నూతన పార్లమెంట్?

Sunday, December 13th, 2020, 07:02:35 PM IST

నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పట్ల ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్న సమయం లో నూతన పార్లమెంట్ భవనం అవసరమా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ పై కమల్ నిప్పులు చెరిగారు. దేశ ఆర్ధిక వ్యవస్థ దుర్బర స్థితిలో ఉన్నప్పుడు భారీ వ్యయం తో నూతన పార్లమెంట్ భవనం ఎందుకు అని అన్నారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణం గా జీవనోపాధి కోల్పోయి దేశంలోని సగం మంది ప్రజలు ఆకలితో బాధపడుతుంటే వెయ్యి కోట్ల రూపాయల తో నిర్మించాల్సి న అవసరం ఏమిటి అని నిలదీశారు . ప్రజల్ని రక్షించేందుకు గ్రేట్ చైనా వాల్ నిర్మిస్తున్నాం అని తెలిపారు, కానీ ఆ క్రమంలో వేలాది కార్మికులు మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఎవరిని రక్షించేందుకు నూతన పార్లమెంట్ నిర్మాణం అని సూటిగా మోడీ ను ప్రశ్నించారు.