నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలలో మొత్తం 824 ఓట్లు ఉండగా 823 ఓట్లు పోలయ్యాయి. అయితే టీఆర్ఎస్ 728 ఓట్లు, బీజేపీ 56 ఓట్లు, కాంగ్రెస్కు 29 ఓట్లు రాగా 10 ఓట్లు చెల్లకుండా పోయాయి.
అయితే స్థానిక సంస్థలలో బీజేపీ కంటే కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు ఉన్నా, ఈ ఉప ఎన్నికలో మాత్రం బీజేపీ కంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 824 ఓటర్లలో 49 మంది జెడ్పీటీసీలు, 535 మంది ఎంపీటీసీలు, 226 మంది కౌన్సిలర్లు, ఇతరులు 12 మంది ఉన్నారు. అయితే ఇందులో టీఆర్ఎస్కు 494 ఓటర్లు కాంగ్రెస్కు 140, బీజేపీకి 84, స్వతంత్రులు 66, ఎంఐఎంకు 28 ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 14 న కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.