ట్విట్టర్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన కల్వకుంట్ల కవిత..!

Monday, September 21st, 2020, 09:51:02 AM IST

టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే కవిత ట్విట్టర్‌లో వన్ మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది.

అయితే దక్షిణ భారత దేశంలో వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న తొలి మహిళా నేతగా కవిత రికార్డ్ సృష్టించింది. అయితే ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలికి ఇంత మంది ఫాలోవర్లు ఉండడం మరో విశేషం. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన చాలా మంది కవితను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.