గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం

Thursday, March 18th, 2021, 09:07:15 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే గుంటూరు కృష్ణా జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానం కి పోటీ చేసిన కల్పలత విజయం సాధించారు. బొడ్డు నాగేశ్వర్ రావు పై కల్పలత రెండో ప్రాధాన్యత ఓట్ల తో గెలుపొందారు. అయితే విజయానికి కావల్సినటువంటి 50 శాతం ఓట్లను దాటడం తో అధికారులు విజేత గా ప్రకటించారు. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్ధులు పోటీ చేయగా 12,554 ఓట్లను వినియోగించుకున్నారు. అయితే ఇందులో చెల్లని ఓట్లు పోగా 6,153 ఓట్లు కల్పలత సాధించడం తో గెలిచినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మొదటి ప్రాధాన్యత కింద ఏ ఒక్కరూ కూడా 6,153 ఓట్లు రాకపోవడం తో రెండో ప్రాధాన్యత కింద ఓట్లు లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటించారు.

అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం పట్ల కల్పలత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన విజయం కోసం కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు అని వ్యాఖ్యానించారు. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని, స్తానికురాలు కాదు అనే అభిప్రాయం ఎక్కడా వ్యక్తం కాలేదు అని అన్నారు.