బీసీల రక్తాన్ని జగన్ రెడ్డి జలగలా పీలుస్తున్నారు – కళా వెంకట్రావు

Saturday, October 17th, 2020, 02:04:49 AM IST


ఏపీ సీఎం జగన్‌పై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్ల ఏర్పాటు పేరుతో జగన్ బీసీలను నయవంచన చేస్తున్నారని అన్నారు. కనిపించని రాజ్యానికి రాజుల్లా నిధుల్లేని కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించడం ఏమిటని అన్నారు. బీసీల రక్తాన్ని జగన్ రెడ్డి జలగలా పీలుస్తున్నారని, కొందరికి ప్రయోజనం చేకూర్చడానికే కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే జగన్ 16 నెలల పాలనలో జగన్ రెడ్డి బీసీల కోసం ఒక్క కొత్త పథకమైనా ప్రారంభించారా అని ప్రశ్నించారు. బీసీలకు 139 కార్పొరేషన్లు అని ప్రకటించి ఇప్పుడు 56 మాత్రమే ప్రకటించారని, వాటికి కూడా ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని అన్నారు. కార్పొరేషన్ నిధుల మళ్లింపుపై జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.