ఆ సినిమానుండి తప్పుకున్న కాజల్ .. నిత్యా ?

Sunday, February 11th, 2018, 01:45:42 PM IST

యువ కథానాయకుడు శర్వానంద్ స్లో అండ్ స్టడీ గా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా అయన సుధీర్ వర్మ తో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్, నిత్యా మీనన్ లను ఎంపిక చేసారు .. అన్ని ఓకే అనుకున్న సమయంలో సడన్ గా ఈ ఇద్దరు హీరోయిన్స్ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలిసింది? ఇద్దరు హీరోయిన్స్ ఒకేసారి తప్పుకోవడం సంచలనాం రేపుతోంది. మొత్తానికి ఈ వ్యవహారం లో రెమ్యూనరేషన్ విషయంలోనే తేడాలు వచ్చినట్టు టాక్. శర్వానంద్ డాన్ గా కనిపించే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ప్లేస్ లో మరో హీరోయిన్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట యూనిట్ సభ్యులు.