ట్రంప్ అలా ఎలా ప్రకటించుకుంటారు.. కేఏ పాల్ సీరియస్ కామెంట్స్..!

Thursday, November 5th, 2020, 01:15:27 AM IST

అగ్రదేశం అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ పోటా పోటీగా కొనసాగుతుంది. జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య జరుగుతున్న అద్యక్ష రేసులో ఇప్పటివరకు బైడెన్‌ 223 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా ట్రంప్‌ 212 ఓట్లు సాధించారు. ప్రస్తుతం బైడెన్ ఆధిక్యం కొనసాగుతుండగా కీలక రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ జరుగుతుండటంతో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ ప్రపంచదేశాలన్నిటిలో ఉంది. అయితే ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ఎవరికి వారు తమదే విజయమని చెప్పుకుంటున్నారు.

అయితే డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందు మాట్లాడుతూ తమకు మద్ధతుగా నిలిచిన అమెరికన్లకు ధన్యవాదాలు తెలియచేస్తూ, గెలుపు ధీమాను వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పూర్తి ఓట్లు లెక్కించక ముందే తాను గెలిచానంటూ ట్రంప్ ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు ఉందని, ఓట్ల లెక్కింపు ఆపాలని లేదంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని ట్రంప్ అనడం సరికాదని కేఏ పాల్ అన్నారు.