ఎమ్మెల్యేగా గెలవకుండానే ఏడు పార్టీలు మారాడు.. పవన్‌పై కేఏ పాల్ కామెంట్స్..!

Friday, January 8th, 2021, 03:00:35 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలవకుండానే పవన్ కళ్యాణ్ ఏడు పార్టీలు మారాడని కేఏ పాల్ ఎద్దేవా చేశారు. తొలుత ప్రజారాజ్యం అని, ఆ తరువాత కాంగ్రెస్‌లో, ఆ తర్వాత బీజేపీలొ, ఆ తరువాత సీపీఐ, సీపీఎం, ఆ తరువాత బీఎస్పీ మాయావతి కాళ్లపై పడ్డాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ అంటున్నాడని విమర్శలు గుప్పించారు.

అంతేకాదు తెలంగాణలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన, ఆ తరువాత బీజేపీకి మద్దతు తెలపాడని దీనిని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ నిలకడలేని మనస్థత్వం భయటపడిందని అన్నారు. 5 శాతం ఓటింగ్ ఉన్నా ఒక్క శాతం ఓటింగ్ లేని బీజేపీకి ఎందుకు మద్ధతు ఇస్తున్నావని పాల్ ప్రశ్నించారు. నువ్వు నిజంగా బీజేపీ ఏజెంట్ కాకపోతే తిరుపతిలో ఖచ్చితంగా పోటీ చేసేవాడివని అన్నారు. నీవు నిజంగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే తిరుపతి బై పోల్‌లో పోటీ చెయి లేదంటే మీ అన్నని నిలబెట్టు అదీ కుదరకపోతే నీ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తినైనా బరిలో నిలుపు అని కేఏ పాల్ హితవు పలికారు.