పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేసిన కేఏ పాల్..!

Sunday, August 9th, 2020, 01:14:20 AM IST


జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. జనసేన పార్టీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా పెద్ద మోసగాడే అని అన్నాడు. అసలు నీతి, నిజాయితీ అనే మాటకు పవన్‌కు అర్ధం కూడా తెలియదని అన్నారు. సిద్దాంతం, కట్టుబాట్లు అంటూ మోసం చేశాడని అందుకే జనసేనలో ముందు చేరిన పెద్ద వాళ్లంతా ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారని పాల్ అన్నాడు.

అయితే బీజేపీ అవసరానికి వాడుకునే పార్టీ అని తెలిసినా కూడా మళ్ళీ ఆ పార్టీతోనే జతకట్టాడని అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉందని కానీ ఇలా దిగజారే పరిస్థితికి వెళ్తాడని తాను అయితే అస్సలు అనుకోలేదని అన్నాడు. 2014లో బీజేపీ-టీడీపీకి మద్దతిచ్చాడని, మొన్న ఎన్నికలలో బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిశారని ఇప్పుడు ఆకలి దాహంతో మళ్ళీ బీజేపీ చెంతకు చేరాడని ఆరోపించారు. ఏపీలో కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ పవన్‌కి 2 శాతం ఓట్లు కూడా పడలేదని అన్నారు. ఆయన డ్యాన్స్‌లు వేసుకోవడానికి సినిమాల్లోకి వెళ్లడమే మంచిదని జీవితంలో పవన్ సీఎం కాలేడని విమర్శించారు.