దేవుడి శాపానికి గురి కావద్దు.. సీఎం జగన్‌కు కేఏ పాల్ వార్నింగ్..!

Thursday, December 24th, 2020, 03:00:18 AM IST

ఏపీ సీఎం జగన్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయని, విశాఖలో గ్లోబల్ క్రిస్మస్ వేడుకలను సీఎం జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను మానుకోవాలని, ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే దేవుడి శాపానికి గురికాక తప్పదని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈ నెల 25న పులివెందులలో జరగనున్న క్రిస్మస్‌ వేడుకలకు సీఎం జగన్ హాజర్ కాబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజే సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. అయితే ఈ పర్యటనలోనే సీఎం జగన్ పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.