బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేఏ పాల్..!

Tuesday, January 5th, 2021, 03:20:38 PM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కేఏ పాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలను కేఏ పాల్ ఖండించారు. ఎవరో ఒక తెలంగాణ బీజేపీ లోకల్ నాయకుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, బైబిల్ పట్టుకున్నవారికి ఓటు వేస్తారా? భగవద్గీత పట్టుకున్నవాళ్లకు ఓటు వేస్తారా అనేంత లోలెవల్‌కు దిగిజారిపోయారని అన్నారు.

అయితే ఆర్ఎస్ఎస్ నాయకులు ఇంద్రస్, బయాజోషి ఎన్నోసార్లు నా హోటల్‌కు వచ్చారని భగవత్, రామ్‌లాల్ గారు నాతో చక్కగా మాట్లాడతారని అన్నారు. బీజేపీకి సపోర్టు చేయాలని, అభివృద్ధి చేద్దాం, అవినీతి నిర్మూలన చేద్దామని అడిగారని కేఏ పాల్ అన్నారు. లోకల్ నాయకులు మాట్లాడేముందు నేషనల్ లీడర్లతో కన్సాల్ట్ చేసాక మాట్లాడితే మంచిదని బండి సంజయ్‌కి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.