జురాసిక్ వ‌ర‌ల్డ్ – 2 : డైనోసార్ న‌మిలేయ‌డం గ్యారెంటీ!

Tuesday, February 6th, 2018, 07:29:28 AM IST

డైనోసార్‌ల బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ ఫిక్ష‌న్ సినిమాల‌కు ఆది గురువు స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌. ఆయ‌న డైనోసార్ సృష్టిక‌ర్త‌గా .. గొప్ప సృజ‌న‌శీలిగా ప్ర‌పంచాన్ని త‌న‌దైన ప్ర‌తిభ‌తో మెప్పించారు. జురాసిక్ పార్క్ సిరీస్ లో ఇప్ప‌టికి నాలుగు సినిమాలు రిలీజై సంచ‌ల‌న విజయం సాధించాయి. అయితే స్పీల్‌బ‌ర్గ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌కుండా.. వేరొక ద‌ర్శ‌కుడి సృజ‌న నుంచి వ‌చ్చిన జురాసిక్ వ‌రల్డ్ అంతే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టింది. తాజాగా ఈ సిరీస్‌లో రెండో సినిమా `జురాసిక్ వ‌ర‌ల్డ్ -2` (ఫాలెన్ కింగ్‌డ‌మ్‌) రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇదివ‌ర‌కూ ఓ ట్రైల‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. తాజాగా రెండో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇది కూడా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. మ‌రోసారి డైనోసార్ బ్యాక్ డ్రాప్‌లో అసాధార‌ణ విన్యాసాల్ని 3డిలో వీక్షించే అదృష్టం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌కు సాధ్య‌ప‌డ‌నుంది.

అత్యంత క్రూర‌మైన డైనోసార్ వెంటప‌డి త‌రుముతుంటే.. పంటికింద ప‌డి న‌లిగిపోతుంటే అది ఎలాంటి గ‌గుర్పాటుకు గురి చేస్తుంది అన్న‌ది చిన్న మెరుపు లాంటి స‌న్నివేశాల‌తో చూపించారు. ట్రైల‌ర్ మైండ్ బ్లోయింగ్‌. జూన్ 22న `ఫాలెన్ కింగ్‌డ‌మ్‌` రిలీజ్‌కి రెడీ అవుతోంది.2డి, 3డి, 3డి ఐమ్యాక్స్‌లో ఈ సినిమాని వీక్షించే వెసులుబాటు ఉంది. వేస‌వి పిల్ల‌ల‌కే కాదు పెద్ద‌లకు వేడి పెంచ‌డం గ్యారెంటీ.