ఇద్దరు కుటుంబసభ్యులను కోల్పోయిన బాధితుడి గా వచ్చా – ఎన్టీఆర్

Wednesday, February 17th, 2021, 02:10:23 PM IST

నందమూరి తారక రామారావు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కేంద్రానికి బుధవారం నాడు వచ్చారు. అక్కడ జరుగుతున్న సైబరాబాద్ పోలీస్ వార్షిక సమావేశం లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ వార్షికోత్సవ వేడుకలలో ఎన్టీఆర్ అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను పరిశీలించారు, అంతేకాక అక్కడ ఉపయోగిస్తున్న రక్షణాత్మక పరికరాల పట్ల ఆసక్తి కనబరిచి, వాటి గురించి అడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్. అయితే ఈ వార్షిక సమావేశం లో జూనియర్ ఎన్టీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు గా రాలేదు అని వ్యాఖ్యానించారు. ఒక పౌరుని గా రోడ్డు ప్రమాదం లో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుడి గా వచ్చా అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ట్రాఫిక్ రూల్స్, రోడ్డు జాగ్రత్త సూచనలు పాటించడం సర్వోత్తమమైన విషయం అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులలో అన్న ను, నాన్న ను ఇద్దరిను కూడా రోడ్డు ప్రమాదం లో కోల్పోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం లో సీపీ సజ్జనర్ తో పాటుగా పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.