బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కి సోకిన కరోనా

Monday, December 14th, 2020, 08:53:37 AM IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తనకు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అయితే కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం తో వెంటనే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అని చెప్పుకొచ్చారు.

అయితే కరోనా నిబంధనలను, మార్గదర్శకాలను పాటిస్తూ స్వీయ నిర్బంధం లో ఉంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యం బాగుంది అని, అయితే తనను గత కొద్దీ రోజులుగా కలిసినవారు, సన్నిహితంగా ఉన్నవారు కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని సూచించారు.అందుకు తగ్గ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.