మరో టీఆర్ఎస్ నేతకు కరోనా పాజిటివ్..!

Wednesday, August 26th, 2020, 08:30:17 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే సామాన్య ప్రజలే కాదు ఈ మధ్య సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు నేతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌ని మాత్రం కరోనా కలవరపెడుతుందనే చెప్పాలి.

అయితే తాజాగా మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, వైద్యుల సలహాలతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నానని జూపల్లి తెలిపారు. అయితే ఇటీవల తనను కలిసిన ప్రజలు, నేతలు, పార్టీ కార్యకర్తలు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.