జీవిత రాజశేఖర్ కు జైలు శిక్ష

Monday, November 24th, 2014, 03:07:36 PM IST

jevitha
ఎవడైతే నాకేంటి రైట్స్ కోసం నిర్మాత శేఖర్ రెడ్డికి నటి.. నిర్మాత అయిన జీవిత రాజశేఖర్ 22లక్షల రూపాయల చెక్ ను ఇచ్చారు. అయితే… ఆ చెక్ బౌన్స్ కావాడంతో నిర్మాత శేఖర్ ఎర్రమంజిల్ లోని ప్రత్యేక న్యాయస్తానాన్ని ఆశ్రయించారు. కాగ.. కోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని… జీవిత రాజశేఖర్ కు రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించింది.

ఎవడైంటే నాకేంటి సినిమా 2007వ సంవత్సరంలో వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎవడైతే నాకేంటి సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది.