రాజశేఖర్ ఆరోగ్యం పై జీవితా రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు

Wednesday, November 4th, 2020, 11:10:30 AM IST

ఇటీవల అనారోగ్యం భారిన పడి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్. అయితే కుటుంబ సభ్యులు అంతా కూడా కరోనా వైరస్ భారిన పడినప్పటికీ ఇద్దరు కూతుళ్లు కరోనా నుండి కోలుకున్నారు. అయితే మొదట చాలా క్రిటికల్ గా ఉన్న రాజశేఖర్ ఆరోగ్యం ఇపుడు బావుంది అని, చికిత్స కి స్పందిస్తున్నారు అని జీవితా రాజశేఖర్ తెలిపారు.

ఈ మేరకు రాజశేఖర్ ఆరోగ్యం పై జీవితా రాజశేఖర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది అని పేర్కొన్నారు. వైద్యానికి సహకరిస్తున్నారు అని వివరించారు. అయితే మొదట చాలా క్రిటికల్ స్టేజ్ వరకు వెళ్లారు అని, వైద్యులు, తాము భయపడ్డాము అని తెలిపారు. అయితే వైద్యులు మాత్రం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్య చికిత్స అందించడం జరుగుతుంది అని, అంతేకాక ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ లేకుండా వైద్య చికిత్స అందుతుంది అని, త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని జీవితా రాజశేఖర్ తెలిపారు. అంతేకాక రాజశేఖర్ ఆరోగ్యం త్వరగా కుడుటపడాలి అని కోరుకున్న అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు.