టీపీసీసీ పదవిపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..!

Tuesday, January 5th, 2021, 05:44:03 PM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి తనకు ఖాయమైందని వస్తున్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పీసీసీ పదవి ఖరారుపై తనకు ఎలాంటి సమాచారం అందలేదని, అవన్ని ఊహాగానాలేనని కొట్టి పారేశారు. అయితే నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో సేవ చేస్తున్నానని, అధిష్టానం తనపై నమ్మకంతో ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని జీవన్ రెడ్డి అన్నారు.

అయితే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తే పార్టీ మారుతామని చాలా మంది నేతలు అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఈ నేపధ్యంలో సీనియర్ ఖాతాలో పీసీసీ చీఫ్ పదవి జీవన్ రెడ్డికి ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉంది. అయితే జీవన్ రెడ్డికి పీసీసీ పదవి అప్పగిస్తే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకొని పోతారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.