బీజేపీ అంటేనే అబద్దాల పార్టీ…అమ్మకం పార్టీ – జీవన్ రెడ్డి

Tuesday, March 16th, 2021, 01:38:30 PM IST

కేంద్ర ప్రభుత్వం బీజేపీ పై తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెరాస తరచూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం నాడు గన్ పార్క్ వద్ద మీడియా తో మాట్లాడిన తెరాస నేత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పసుపు బోర్డ్ ఏమైందో చెప్పాలి అంటూ బీజేపీ నేత, ఎంపీ అరవింద్ ను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోము అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది అని అన్నారు. అయితే ఎన్నికల సమయం లో కేంద్రం బోర్డు తీసుకు రాకపోతే రాజీనామా అని ఎంపీ అరవింద్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి దగ్గరికి వెళ్లి పసుపు బోర్డ్ గురించి మాట్లాడాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ మేరకు బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అంటే అబద్దాల పార్టీ అని, అమ్మకం పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజు ఏదో ఒక సంస్థను బీజేపీ అమ్ముతోంది అంటూ ఆరోపించారు. అయితే తెలంగాణ కి రావాల్సిన ఐటిఐఆర్ ప్రాజెక్ట్, రైల్వే కోచ్ ఇవ్వమని కేంద్రం చెప్పింది అని, దాని పై పోరాడాలి అంటూ చెప్పుకొచ్చారు.అయితే తెరాస పార్టీ చేసిన అభివృద్ది గురించి చెప్పడానికి నిన్న గవర్నర్ కి అసెంబ్లీ సమావేశాల్లో గంటకు పైగా సమయం పట్టింది అంటూ చెప్పుకొచ్చారు.