విశాఖ స్టీల్ ప్లాంట్ పై జేడి లక్ష్మినారాయణ కీలక వ్యాఖ్యలు

Friday, March 12th, 2021, 02:20:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సంచలన సృష్టిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై ఇప్పటికే పలు వివాదాలు చుట్టుకున్నాయి. ఈ అంశం పై అధికార పార్టీ వైసీపీ కి, తెలుగు దేశం పార్టీ కి మధ్యలో తీవ్ర స్థాయిలో మాటల యుద్దాలు నడుస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం పై విశ్రాంత ఐపిఎస్ జేడి లక్ష్మినారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం లో ఉన్న ఉక్కు కర్మాగారాలకు భిన్నంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను చూడాలని తెలిపారు.అయితే చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కు ను తిరిగి లాభాల్లోకి తీసుకు రావచ్చు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం అయితే లేదు అని తేల్చి చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి నిపుణుల తో జేడి లక్ష్మినారాయణ చర్చ జరిపినట్లు తెలుస్తోంది. అందుకు నిపుణుల సలహాల తో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం కి పంపానున్నట్లు జేడి లక్ష్మినారాయణ చెప్పుకొచ్చారు.