చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీపై జేడీ లక్ష్మీనారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Friday, January 29th, 2021, 06:52:50 PM IST

ఏపీ రాజకీయాలు ఇంట్రెస్టింగ్‌గా మారిపోయాయి. ఓ పక్క పంచాయతీ ఎన్నికలు వేడీ పుట్టిస్తుంటే, మరో పక్క జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్‌కు అండగా ఉంటానని హామీ ఇచ్చారని, పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను ఉంటానని చిరంజీవి చెప్పాడని అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌కు కొన్నాళ్లు సినిమాలు చేయమని సలహా ఇచ్చింది కూడా చిరంజీవేనని నాదెండ్ల మనోహర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా నిన్న ఇదే విషయాన్ని ప్రకటించారు. బీజేపీ, జనసేన కూటమికి 2024 ఎన్నికల్లో చిరంజీవి మద్దతు ఉంటుందని వెల్లడించారు.

ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీపై స్పందించిన జనసేన పార్టీ మాజీ నేత జేడీ లక్ష్మీనారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి 18 శాతం ఓట్లు, 18 సీట్లు సాధించిన చిరంజీవి ఇప్పుడు కూడా ఎంతోకొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని, అయితే చిరంజీవి అసలు జనసేన పార్టీలో చేరతారా లేక బయట నుంచి మద్దతు తెలుపుతారా అనేది వేచి చూడాలని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.