సజ్జల నన్ను చంపాలని చూస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం..!

Sunday, December 27th, 2020, 11:00:23 PM IST

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనను చంపించాలని చూస్తున్నారని అన్నారు. ‘నేను ప్రజల మనిషిని, ప్రజల్లోనే ఉంటా చంపుతావా అని సజ్జలను ప్రశ్నించారు. అంతేకాదు తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి సీసీ ఫుటేజీ తీసుకొని కేసు పెట్టమని తాను పోలీసులను కోరానని, కానీ పోలీసులు తమపై ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారని వ్యాఖ్యానించారు.

అయితే సజ్జల చెప్పినట్టు పోలీసులు వింటున్నారని, నేను కేసు పెడితే పోలీసులు సస్పెండ్ అవుతారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పార్నపల్లి, పెండెకల్లు, అచ్యుతాపురంలో దాడులు చేసి దోచుకున్నారని, చంబల్‌ లోయల్లో ఉండాల్సిన వాళ్లు తాడిపత్రిలో ఉన్నారని అన్నారు.