గురువారం నాడు బెయిల్ పై విడుదల కానున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

Thursday, August 20th, 2020, 01:59:39 AM IST


తెలుగు దేశం పార్టీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం నాడు బెయిల్ పై విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాక గతం లో గుండె కి శస్త్ర చికిత్స జరగడం కారణం గా బెయిల్ పిటిషన్ పెట్టుకోవడం తో న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఈ మేరకు గురువారం నాడు బెయిల్ పై విడుదల కానున్నారు.

అయితే అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో అస్మిత రెడ్డి మరియు జేసీ ప్రభాకర్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇటీవల బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే విడుదల సమయం లో ర్యాలీ గా తరలి రావడం తో పోలీసులు కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘించ కూడ దు అని తెలిలినప్పటికి ర్యాలీగా వెళ్ళడం తో పోలీసులు అడ్డుకొనే యత్నం చేయగా, దూషించిన సంగతి తెలిసిందే. అందుకు పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా కరోనా వైరస్ సోకడం తో బెయిల్ పై విడుదల కానున్నారు.