టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్..!

Wednesday, August 19th, 2020, 07:33:14 AM IST

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సామన్య జనాలే కాదు ఈ మధ్య చాలా మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడగా తాజాగా మరో నేత కరోనా బారిన పడ్డారు.

ఇటీవల వరుస కేసులతో సతమతమవుతున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అంతేకాదు గత కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్‌లో ఉన్న వారు క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు.