జగన్ నైతిక విలువలు కలిగిన వ్యక్తి.. జేసీ సంచలన వ్యాఖ్యలు..!

Thursday, March 18th, 2021, 05:44:05 PM IST

ఏపీలో ఎంతో ఉత్కంఠ రేపిన అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య ఈ మున్సిపాలిటీని ఎట్టకేలకు టీడీపీ సొంతం చేసుకుంది. మున్సిపల్‌ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కౌన్సిలర్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నైతిక విలువలు కలిగిన మనిషి అని, ఆయన సహకారం లేకపోతే నేను ఛైర్మన్ అయ్యేవాడిని కాదని అన్నారు.

అంతేకాదు సేవ్ తాడిపత్రి నినాదంతో ముందుకు వెళ్తామని, ఇకపై తాడిపత్రిలో రౌడీయిజం.. గుండాయిజం ఉండదని అన్నారు. తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అవసరమైతే సీఎం జగన్‌ను కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పనిచేస్తానని జేసీ ప్రభాక్ర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే మొన్నటి వరకు జగన్ మీద ఒంటి కాలిపై లేచిన జేసీ ఇలా సడెన్‌గా యూటర్న్ తీసుకోవడం టీడీపీ శ్రేణులను కలవరపెడుతుంది.