మరో 15 రోజుల్లో నేను వస్తాను, మీరు రావద్దు – జేసీ ప్రభాకర్ రెడ్డి

Sunday, August 23rd, 2020, 09:59:36 AM IST

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తొలుత ఓ కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదల అయిన జేసీ ప్రభాకర్ రెడ్డిని కరోనా నిబంధనలు పాటించలేదని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

అయితే జైలులో ఉండగానే ఆయనకు కరోనా సోకడంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కింస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతానికి నేను బాగున్నానని నా ఆరోగ్య పరిస్థితి బాగుందని ఆయన అన్నారు. నన్ను కలవడానికి ఎవరూ హైదరాబాద్ రావద్దు, మరో 15 రోజుల్లో మిమ్మల్ని కలవడానికి నేనే తాడిపత్రి వస్తానని ప్రస్తుతం మా కుటుంబ సభ్యులను చూడడానికి కూడా అనుమతించడం లేదని అన్నారు.