సీఎం జగన్ అరాచక పాలనే టీడీపీ కి పీఠాన్ని కట్టబెడుతుంది – జేసీ ప్రభాకర్ రెడ్డి

Sunday, March 7th, 2021, 09:00:48 PM IST

తెలుగు దేశం పార్టీ చాలా ప్రాంతాల్లో తన పట్టును కోల్పోయింది ఈ పంచాయతీ ఎన్నికల్లో. అయితే ఈ పురపాలక, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ నే భారీ విజయం సాధిస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ మేరకు అనంతపురం లో ప్రచారం నిర్వహించారు. తాను చేసిన అభివృద్ధి నీ చూసి ఓటు వేయాలి అంటూ చెప్పుకొచ్చారు. ఆదివారం నాడు అనంతపురం లోని తాడిపత్రి లో ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ అరాచక పాలనే తెలుగు దేశం పార్టీ కి పీఠాన్ని తెచ్చిపెడుతుంది అని వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మేల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన కుమారుడిని పురపాలక చైర్మన్ పీఠం పై కూర్చే బెట్టేందుకు శక్తి మేరకు కృషి చేస్తున్నారు అని తెలిపారు. పట్టణాన్ని అభివృద్ది చేస్తామని హమి ఇస్తున్నారు అని అన్నారు. అయితే ఇప్పటికే అక్కడ రెండు స్థానాలు ఏకగ్రీవం కావడం తో మిగతా 34 స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి.