ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ..!

Wednesday, November 18th, 2020, 04:20:43 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన సనగతి తెలిసిందే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెబుతుంది. దీంతొ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్రమైన చర్చ సాగుతుంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఒక్కటే ఎన్నికలు జరపలేదని, ఎన్నికలు జరపాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం ఉండాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన నిధులను సమకూర్చాల్సింది ప్రభుత్వమేనని అన్నారు. ఎన్నికలు సంఘం చెప్పినట్టుగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదని, అనుకున్నది జరగడానికి సీఎం ఎంత దూరమైనా వెళ్తారని అన్నారు.