సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి!

Monday, June 1st, 2020, 05:06:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన పై ప్రతి పక్ష పార్టీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు పై మాజీ ఎంపీ, టిడిపి నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యధిక మెజారిటీ ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అనే అహం తో వ్యవహరిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం లో హైకోర్ట్ ఇచ్చిన తీర్పు నీ సైతం జగన్ పట్టించుకోవడం లేదు అని అన్నారు.ఉన్నత న్యాయ స్థానం ను లెక్క చెయ్యకుండా ఉండటం పట్ల జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎవరూ చెప్పిన వినక పోవడం తో, ప్రధాని మోడీ చెబితే జగన్ వింటారేమో అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పై సుప్రీం కోర్టు కి వెళ్ళాలన్న నిర్ణయం సరైంది కాదు అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే మూడు రాజధానుల ప్రకటన తో అమరావతి ప్రాంత ప్రజలు,రైతులు గత 160 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం తో వ్యవహరించడం లేదు అని అన్నారు. ప్రతి పక్ష పార్టీలు టిడిపి, బీజేపీ, జన సేన పార్టీలు వైసీపీ కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న తరుణంలో వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యల పై ఎలా స్పందిస్తారో చూడాలి.