జయప్రదకు అరుదైన గౌరవం!

Wednesday, April 22nd, 2015, 06:32:57 PM IST

Jayaprada,
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు అరుదైన గౌరవం లభించింది. కాగా తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిన జయప్రద సినీ రంగంలో కనబరచిన ప్రతిభకు గుర్తింపుగా ఆమె ‘కళాశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది. ఇక ఈ పురస్కారాన్ని మంగళవారం దాదా సాహెబ్ ఫిలిం ఫౌండేషన్ ముంబైలో ఆమెకు బహూకరించారు.

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ‘కళా శ్రీ’ అవార్డును అందుకోవడం ఆనందకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో సినీ రంగానికి సేవలు అందిస్తానని జయప్రద పేర్కొన్నారు. ఇక తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన దాదా సాహెబ్ ఫౌండేషన్ వారికీ, తన శ్రేయోభిలాషులకు జయ కృతజ్ఞ్యతలు తెలిపారు.