అందుబాటులోకి ‘అమ్మ కాల్ సెంటర్లు’.. అందుకోసమే..!

Tuesday, January 19th, 2016, 10:16:13 PM IST


తమిళనాడు సీఎం జయలలిత తాజాగా మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తమిళనాడులో జయలలిత పుణ్యమా అని అమ్మ క్యాంటీన్, అమ్మ ఉప్పు, అమ్మ వాటర్, అమ్మ సిమెంట్ తదితర పథకాలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అమ్మ పేరుతో నూతన పథకం ప్రారంభమైంది.

అసలు విషయంలోకి వెళితే, సీఎం జయలలిత తాజాగా ‘అమ్మ కాల్ సెంటర్లు’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు అమ్మ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి వివిధ రకాల సమస్యలకు పరిష్కారం పొందవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఈ కాల్ సెంటర్లు 365 రోజులు, 24 గంటలు పనిచేస్తాయని పేర్కొంది. అలాగే ఈ కాల్ సెంటర్లకు 1100 టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. అదే విధంగా సమస్యపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు సమాచారం అందిస్తారని సమాచారం. మరి అమ్మ జాబితాలోకి చేరిన ఈ అమ్మ కాల్ సెంటర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.