దుబ్బాకలో బీజేపీ గెలుపుపై జనసేన ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Wednesday, November 11th, 2020, 01:08:52 AM IST


దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటా పోటీగా సాగిన కౌంటింగ్‌లో ఎట్టకేలకు బీజేపీ విజయం సాధించింది. అయితే దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడంపై జనసేన పార్టీ స్పందించింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ నేతృత్వంలో దుబ్బాకలో విజయం సాధించిన రఘునందన్‌ రావుకు అభినందనలు తెలుపుతున్నట్లు ట్విట్టర్‌లో ఓ ప్రకటన చేసింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ పతాకం ఎగురవేయడంలో ఎంతో కృషి చేసిన బండి సంజయ్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్న జనసేన, ఆయన రాష్ట్ర బాధ్యతలు చేపట్టాక ఎదుర్కొన్న తొలి ఎన్నికలోనే పార్టీని విజయతీరానికి చేర్చారని, ఎన్నికల సమయంలో ఎన్ని విధాలైన ఒతిళ్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారని, ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం అవగతమవుతోందని జనసేన ప్రకటనలో పేర్కొంది.