రాజధాని అంశం పై హైకోర్టు లో కౌంటర్ దాఖలు వేసేందుకు జన సేన నిర్ణయం

Sunday, August 30th, 2020, 09:27:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం పై కౌంటర్ దాఖలు చేసేందుకు జన సేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన అవకాశం తో పవన్ కళ్యాణ్ కౌంటర్ దాఖలు చేయడానికి సిద్దం గా ఉన్నట్లు జనసేన పార్టీ ఒక ప్రకటన లో తెలిపింది. అయితే దీని పై నిర్ణయం తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి చెందిన నేతల తో చర్చలు జరిపారు. ఇందులో అమరావతి రాజధాని అంశం పై పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్యాయం జరగకూడదు అని స్పష్టం చేశారు. అయితే అక్కడ భూముల్లో రాజధాని కోసం పలు నిర్మాణాలు చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. వాటి పై సైతం పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.నిర్మాణాలు చేపట్టారు అని, అవి వివిధ దశల్లో ఉన్నట్లు గా పార్టీ నేతలకు తెలిపారు. రాజధాని నిర్మణానికి ప్రజాధనం వెచ్చించిన విషయం తెలియజేశారు. అయితే ఈ కేసులో తుది వరకు బాధ్యతగా నిలబడతాం అని, న్యాయ నిపుణుల, వారి సలహాల మేరకు కౌంటర్ దాఖలు వేస్తాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు.