జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్దం.. జనసేన కీలక ప్రకటన..!

Tuesday, November 17th, 2020, 06:30:33 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగింది. ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను, ప్రచార ప్రక్రియను రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇలాంటి తరుణంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఏపీలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్న జనసేన, జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తుందా లేక బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే రేపటి నుండి ఈ నెల 20 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 1 న పోలింగ్ జరగనుండగా, 4వ తేదిన కౌంటింగ్ ఉండబోతుంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని, ఈ సారి కూడా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.