తిరుపతి ఉప ఎన్నిక పై జన సేన నుండి ఇంకా రాని స్పష్టత?

Friday, January 22nd, 2021, 11:55:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కోసం గెలుపు కోసం అన్ని పార్టీ లు తమ వ్యూహాలను రచించుకుంటున్నాయి. అయితే ఈ ఉప ఎన్నిక అధికార వైసీపీ కి, ప్రతి పక్ష పార్టీ లు అయిన తెలుగు దేశం పార్టీ, బీజేపీ, జన సేన లకు కూడా కీలకం కానున్నాయి. అయితే ఈ ఎన్నిక విషయం లో అన్ని పార్టీ లు కూడా సరైన స్పష్టత తో దూసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే జన సేన పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారు అనే దాని పై ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాక బీజేపీ తో పొత్తు కారణం గా ఇంకా. వీరి మధ్య చర్చలు కూడా పూర్తి కాలేదు.

అయితే బీజేపీ పోటీ చేసేందుకు తగు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు జన సేన పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జన సేన తన బలాన్ని చూపించుకోవాల్సిన సమయం లో కూడా బీజేపీ కి తిరుపతి స్థానం ఇవ్వడం పట్ల కార్యకర్త లు, నేతలు, రాజకీయ వ్యవహారాల కమిటీ వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కి తిరుపతి లో గెలిచే అవకాశాలు లేవు అని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ప్రస్తుతం తిరుమల శ్రీవారి ను దర్శించుకొని ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు.