వైఎస్ జగన్ అదే దారిలో నడుస్తున్నారు – జన సేన ఎమ్మెల్యే

Thursday, December 3rd, 2020, 02:09:35 PM IST

జన సేన పార్టీ కి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ పాలన లో రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని తెలిపారు. ఏ ముఖ్యమంత్రి తీసుకొని ప్రజా సంక్షేమ నిర్ణయాలను సీఎం జగన్ చాలా చిన్న వయసులోనే అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం దక్కించుకున్నారు అని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం ఇంతగా పరితపించే సీఎం ను తానెప్పుడూ చూడలేదు అని అన్నారు.

అయితే తాను బ్రతికి ఉన్నంత వరకు కూడా వైఎస్ జగనే ముఖ్యమంత్రి అంటూ కొనియాడారు. లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అని, సచివాలయాల ద్వారా ప్రతి గ్రామం లో ముప్పై నుండి నలభై మంది వాలంటీర్ లను నియమించడం ప్రశంసనీయం అని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం జగన్ దే అని అన్నారు. దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణ యుగం లా ఉండేది అని, వైఎస్ జగన్ అదే దారిలో నడుస్తున్నారు అని రాపాక వరప్రసాదరావు అన్నారు. అయితే 40 ఏళ్లుగా రాజకీయాల్లో అంటూ 14 ఏళ్లుగా సీఎం గా పని చేసిన చంద్రబాబు నాయుడు ఏనాడూ ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.