బీజేపీ తో పొత్తే జనసేన అభ్యర్ధుల ఓటమికి కారణం – పోతిన మహేష్

Monday, March 15th, 2021, 03:09:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ, నగర పాలక ఎన్నికలు ముగిశాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో పర్వాలేదు అనిపించిన జన సేన, నగర పాలక ఎన్నికల్లో మాత్రం విఫలం అయింది అని చెప్పాలి. అయితే బీజేపీ తో పొత్తు జన సేన అభ్యర్ధుల ఓటమికి కారణం అని జన సేన పార్టీ అధికార ప్రతినిధి పొతిన మహేష్ అన్నారు. అయితే ఒక కూటమి గా ఏర్పడటం వలన మైనారిటీ లు అంతా తమను వ్యతిరేకించారు అని స్పష్టం చేశారు.అయితే ఎన్నికల్లో ఓటమికి పార్టీ అధిష్టానానికి నివేదిక అందిస్తామని అన్నారు. జన సేన కి బీజేపీ వలన విజయవాడ లో పెద్ద నష్టం జరిగింది అని అన్నారు.

అయితే మేం ఎక్కడికి వెళ్ళినా ముస్లిం లు, ఎస్సీ లు, ఎస్టీ లు మమ్మల్ని వ్యతిరేకించారు అంటూ చెప్పుకొచ్చారు.అంతేకాక పశ్చిమ నియోజక వర్గంలో గెలుస్తామని అనుకున్న స్థానాల్లో కూడా ఓడిపోయాం అని వ్యాఖ్యానించారు. అయితే కరోనా సమయం లో ప్రజలకు అండగా ఉన్నాం అని, ప్రజా సమస్యల పై పోరాడం అని అన్నారు. ఓటమి గెలుపు గా మారడానికి ఐదేళ్లు నిరీక్షించాలి అని అన్నారు. విజయవాడ లో బీజేపీ ఎక్కడైనా మాకు అండగా నిలిచిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ పొత్తు మరియు ఫలితాల వ్యవహారం పై నివేదిక అందజేస్తాం అని వ్యాఖ్యానించారు.