తెలంగాణకు జన సేన అధినేత కోటి విరాళం..!

Wednesday, October 21st, 2020, 09:15:37 AM IST

తెలంగాణ రాష్ట్రం లో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల భారీ వరదలు ముంచెత్తాయి. జల దిగ్బంధం అవ్వడం మాత్రమే కాకుండా, ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మహా నగరం హైదరాబాద్ లో పరిస్తితి మరింత దారుణం అని చెప్పాలి. వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో నీ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సి వస్తుంది. అధికారులు సైతం ముంపు ప్రాంతాల్లో ను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 550 కోట్ల రూపాయల న్ ప్రకటించి ప్రజలకు తక్షణ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ప్రముఖులు, సినీ పరిశ్రమ కె చెందిన వారు, రాజకీయ నాయకులు ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. అయితే తాజాగా జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. సహాయక చర్యల నిమిత్తం ఈ కోటి రూపాయలు ప్రజలకు అండగా ఉంటుంది అని తెలిపారు. అంతేకాక జన సైనికులు, తన అభిమానులు, ఈ సహాయక చర్యల్లో పాల్గొనాలని, వారికి వీలైన సహాయం అందించాలి అని పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు.