జనసేన ఉంటుందో, లేదో తెలియదు.. ఎమ్మెల్యే రాపాక సంచలనం..!

Tuesday, August 11th, 2020, 05:22:57 PM IST

ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటును గెలిచిన సంగతి తెలిసిందే. రాజోలు తరుపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రమే ఆ ఎన్నికలలో విజయం సాధించారు. అయితే ముందు నుంచి రాపాక వ్యవహారం పార్టీలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీకి మద్ధతు తెలుపుతూ జనసేనపై ఏదో ఒక రకంగా ఆరోపణలు చేస్తున్నారు.

అయితే తాజాగా రాపాక జనసేన పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం వైసీపీ వైపే ఉన్నానని, తాను జనసేన నుంచి గెలిచానని కానీ ఆ పార్టీ ఉంటుందో, లేదో తెలియదని అన్నారు. జనసేన పార్టీపై ఇష్టం లేకున్నా కొంత మంది తనను చూసి ఓటేసి గెలిపించారని అన్నారు. అయితే వైసీపీలో వర్గాలు ఉన్నాయి కానీ అధినేత ఒక మాట చెబితే ఒక గొడవ కూడా ఉండదని అన్నారు. తాను గెలిచిన తరువాత జగన్‌ను కలిశానని, టికెట్ ఇవ్వలేకపోయానని సీఎం తనతో అన్నట్టు చెప్పుకొచ్చాడు.