పవన్ కు మరో షాకిచ్చిన రాపాక..!

Wednesday, August 5th, 2020, 07:01:24 AM IST

ఏదో చేస్తామని రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తన మొదటి ఎన్నికలోనే ఘోరమైన పరాభవం ఎదురు కావాల్సి వచ్చింది. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకటి కూడా గెలవలేదు. కానీ పార్టీ తరపు నుంచి గెలిచింది ఒకే ఒక్క స్థానం రాజోలు నుంచి సీటు.

రాపాక వర ప్రసాద్ గెలిచింది. ఈయన వ్యవహార శైలి మొదట్లో బాగానే ఉన్నా తర్వాత మాత్రం మెల్లగా పవన్ కు వరుస షాకులివ్వడం మొదలు పెట్టాడు. అధికార పార్టీ వైసీపీకు వత్తాసు పలుకుతుండడం జనసేన శ్రేణులకు తీరని తలనొప్పిగా మారింది. వైసీపీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం, జగన్ ఫోటోలకు పాలభిషేకాలు ఇంకా చాలానే చేశారు.

దీనితో ఆయన జనసేనలో ఉన్నా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు. అయినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేదు. తాజాగా వైసీపీ జెండాలు పట్టుకొని ఉన్న నేతలు మరియు కార్యకర్తలతో కలిసి జనసేన ఎమ్మెల్యే అయిన ఇతను కూడా ఓ వైసీపీ కార్యకర్తలా కొవ్వొత్తి పట్టుకోని ర్యాలీ చేస్తున్న ఫోటో బయటకొచ్చింది. దీనితో ఈ ఫోటో చూసి జనసేన శ్రేణులు మరింత స్థాయిలో మండిపడుతున్నారు.