తెలంగాణలో బీజేపీకి పవన్ కళ్యాణ్ మరో షాక్ ఇవ్వబోతున్నాడా?

Friday, March 19th, 2021, 01:52:25 AM IST


తెలంగాణలో బీజేపీకి, జనసేనకు చెడిందా అంటే అవునన్న సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి పవన్ కళ్యాణ్ మద్ధతు ప్రకటించి బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది మరువక ముందే తెలంగాణలో బీజేపీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది.

అయితే ప్రస్తుతం తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు వచ్చే నెలలో జరగబోతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సిద్దమవుతున్నాయి. దుబ్బాక తరహాలోనే ఈ స్థానాన్ని కూడా సొంతం చేసుకోవాలని బీజేపీ పావులు కదుపుతుంది. ఇదిలా ఉంటే ఇక్కడ జనసేన కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్దమైనట్టు కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని నేరుగా ప్రకటించకపోయినప్పటికి తాజాగా ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆ అనుమానానికి ఆజ్యం పోసింది. అయితే అదే జరిగితే కనుక ఓట్లు చీలి బీజేపీకి నష్టం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ ఈ విషయంలో బీజేపీ, జనసేన కలిసి చర్చించుకుంటాయా, లేక ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తాయా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.