జనసేనకు షాక్.. “గాజు గ్లాసు”ను కోల్పోయింది..!

Saturday, April 17th, 2021, 09:22:53 AM IST


తెలంగాణలో జనసేనకు షాక్ తగిలింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల పోటీలో జనసేన గాజు గ్లాసు కామన్ గుర్తును కోల్పోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీచేయని నేపథ్యంలో కామన్‌ గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఎంసీపీఐ (యూ)(గ్యాస్‌ సిలిండర్‌), ఇండియన్‌ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్‌), హిందుస్థాన్‌ జనతా పార్టీ (కొబ్బరి తోట) కూడా కామన్‌ గుర్తులను కోల్పోయాయి.

అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు నేపధ్యంలో పోటీ నుంచి జనసేన తప్పుకుందని ఎస్‌ఈసీకి జనసేన అధ్యక్షుడు లేఖ రాశారు. ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు మరియు ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో తాము పోటీచేయాలని నిర్ణయించుకున్నామని కాబట్టి తమ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కొనసాగించాలని ఎస్‌ఈసీని కోరారు. అయితే జనసేన సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు ఎస్ఈసీ స్పష్టం చేసింది. 2025 నవంబర్‌ 18 వరకు జనసేన, ఇతర పార్టీలు కామన్‌ సింబల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లేదని ఎస్ఈసీ తెలిపింది.