వైసీపీ మంత్రి వెల్లంపల్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన నేత..!

Saturday, December 12th, 2020, 03:00:30 AM IST

ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని దేవాలయాలను మంత్రి వెల్లంపల్లి తనకి అనువుగా మార్చుకున్నారని అన్నారు. దేవాలయాల ఆస్తులను తన బినామీల ద్వారా వెల్లంపల్లి తన పేరుకి మార్చుకున్నారని ఆరోపించారు. దుర్గగుడిలో మూడు సింహాల మాయం ప్రాథమిక దర్యాప్తు కూడా ఇంకా పూర్తికాలేదని అన్నారు.

అయితే మంత్రి వెల్లంపల్లి చేస్తున్న తప్పులపై సాక్ష్యాధారాలు ఎన్ని బయటపడుతున్న సీఎం జగన్ ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు. జిల్లా ఇన్‌‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆశీస్సులు మంత్రి వెల్లంపల్లికి పుష్కలంగా ఉన్నాయని, అవినీతితో వెల్లంపల్లి సంపాదించిన ఆస్తుల విలువ వెయ్యి కోట్లు దాటిపోయిందని వ్యాఖ్యానించారు. అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన అనుచరులు దండుపాళ్యం గ్యాంగ్ మాదిరిగా తయారయ్యారని అన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి మంత్రి వెల్లంపల్లి చీడపురుగులా తయారయ్యారని పోతిన మహేశ్ చెప్పుకొచ్చారు.