అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను – నాగబాబు

Saturday, May 23rd, 2020, 12:00:52 AM IST

జన సేన పార్టీ నేత, నటుడు నాగబాబు ఇటీవల కాలంలో తన ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాను చేసే వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగతం అని తాజాగా వ్యాఖ్యానించారు. నాతురాం గాడ్సే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాగబాబు, మరొకసారి వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాసను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు.

తాజాగా వైజాగ్ లో ఎల్ జీ పాలిమర్స్ కంపెనీ న్ నుండి విష వాయువు విడుదల కావడం వలన బాధితులను పరామర్శించేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వైజాగ్ లో బస చేశారు.అయితే అక్కడే ఉన్న అవంతి శ్రీనివాస్ అక్కడి మూగ జీవులకు గడ్డి పెడుతూ కనిపించారు. అయితే అక్కడ తీసిన ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి.

అయితే గతంలో అవంతి శ్రీనివాస్ ప్రజా రాజ్యం పార్టీ ద్వారా ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఆ తర్వత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. 2014 లో టిడిపి తరపున గెలిచారు. ఈసారి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి కూటమి లో ఒకరై ఉన్నారు. అయితే అవంతి శ్రీనివాస్ ఇలా పార్టీలు మారుతూ ఉండే తీరు ను ఇలా వ్యంగ్యంగా సెటైర్స్ వేసే ఉండే అవకాశం ఉన్నట్లు కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.