అంబటి రాంబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు

Sunday, April 5th, 2020, 11:22:05 PM IST


జన సేన పార్టీ నేత, నటుడు నాగబాబు అంబటి రాంబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం కరోనా అకౌంట్ లో పేదలకు ఇచ్చే 1000 వైసీపీ ప్రభుత్వం వారు ఇస్తున్నట్లు మీ నాయకులు బిల్డ్ అప్ ఇచ్చి రాబోయే ఎలక్షన్స్ లో ఓట్లు అడుగుతున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే అది ఆపండి సార్, లేదంటే శవాల మీద పేలాలు ఎరుకొనే బ్యాచ్ అంటారేమో అని నా ఫీలింగ్ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దేవుడా ఇక అంబటి రాంబాబు ఆరోగ్యం నువ్వే కాపాడాలి, మన చేతుల్లో లేదు. ఈరోజు అంబటి రాంబాబు గారి కోసం నేను కూడా దీపం వెలిగిస్తా అని వ్యాఖ్యానించారు. ఆయన ఆరోగ్యం బాగుపడితే అమ్మోరికి తల నేలలు సమర్పిస్తాను అని వ్యాఖ్యానించారు.అవి నావి కాదు అంబటి రాంబాబు గారి తల నీలాలు అని ఘాటు విమర్శలు చేశారు.