త్వరలో రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ జన సేన తోనే!

Thursday, October 22nd, 2020, 12:00:09 PM IST

బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో తన సత్తా చాటుకునేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్పీడ్ గానే పావులు కదుపుతూ, అధికార పార్టీ తీరును ఎండగడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని ఆరాట పడుతుంది. అయితే జన సేన పార్టీ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అటు జన సైనికులు, ఇటు అధ్యక్షుడు కూడా ఇందుకు భారీగా మద్దతు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ మాత్రమే కాకుండా, ప్రజల పక్షాన నిలబడి కొన్ని కార్యక్రమాల్లో తన వాయిస్ ను వినిపించారు.

అయితే ఈ బీజేపీ మరియు జన సేన తెలంగాణ రాష్ట్రం లో కూడా పాగా వేసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తో పాటుగా జన సేన కలిసి పోటీ చేయనుంది. ఇందుకు సంబంధించిన చర్చలు సైతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ లో వీరిద్దరూ కలిసి పోటీ చేయడం వంటి ప్రక్రియ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే త్వరలోనే పవన్ దీని పై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.