కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ వస్తే చూపిస్తా.. కాంగ్రెస్ నేత జానారెడ్డి సవాల్..!

Sunday, March 28th, 2021, 03:00:42 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సవాల్ విసిరారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపధ్యంలో హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన జానారెడ్డి కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ వస్తే తాను చేసిన అభివృద్ధిని చూపిస్తానని అన్నారు. తాను సాగర్‌కు ఏం చేశానో అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని ఆవేశంగా మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నేతలు నీళ్లు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని, నల్గొండ జిల్లాకు సాగర్‌ ద్వారా నీళ్లు ఇచ్చింది తామేనని గుర్తు చేశారు.

అయితే కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడుపోయారని అన్నారు. సర్పంచ్‌గా గెలవలేని వాళ్లు ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. జానారెడ్డి అంటే పోరాటయోధుడని, తండాలకు వెలుగులు తెచ్చింది తానేనని అన్నాడు. కాంగ్రెస్‌ హయాంలో రెండు లక్షల ఎకరాలు పేదలకు పంచామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కనీసం 10 వేల ఎకరాలు పంచలేదని జానారెడ్డి ఆరోపించారు.